అరుదైన ఘనత.. సముద్రంలో చదరంగం

అరుదైన ఘనత.. సముద్రంలో చదరంగం

చెన్నైలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్‌ ఆడారు.  అరవింద్‌ తరుణ్‌ శ్రీ అనే టెంపుల్‌ అడ్వైంచర్స్‌ డైవింగ్‌ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఈ ఘనత సాధించారు. స్థానిక నీలకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్‌ చేశారు. పావు గంటలకు ఓ గేమ్‌ చొప్పున రెండు గంటల పాటు చెస్‌ ఆడారు. ఇందు కోసం ప్రత్యేకమైన చెస్‌ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాల కోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట.

 

Tags :