అలరించిన సిఎఎ ఆంధ్ర దినోత్సవ వేడుకలు

అలరించిన సిఎఎ ఆంధ్ర దినోత్సవ వేడుకలు

చికాగో ఆంధ్ర సంఘం వారు ఆంధ్ర సాంస్కృతిక దినోత్సవ వేడుకలు నవంబర్‌ 5వ తేదీన నేపర్విల్‌ ఎల్లోబాక్స్‌ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. చైర్మన్‌ సుజాత అప్పలనేని, ఉపాధ్యక్షులు గౌరీశంకర్‌ అద్దంకి గారి సహకారంతో అధ్యక్షులు మాలతి దామరాజు గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి 1200 మందికి పైగా విచ్చేసి వీక్షించారు. దసరా మరియు దీపావళి పండుగలు రెండూ ఒకేసారి ఒకేచోట జరిగినట్లుగా అందరూ ఆనందోత్సాహాలతో కలసి పాల్గొన్నారు. దీపప్రజ్వలన, తరువాత ప్రార్ధనా గీతంతో మొదలయి నాణ్యత, నవ్యత, వినోదం కలగలసిన ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. శివ పసుమర్తి, సంధ్య అప్పలనేని సమయోచితంగా వ్యాఖ్యానాన్నందించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ మాన్‌ రాజా కృష్ణమూర్తి, స్టేట్‌ రెప్‌ జానెట్‌ యాంగ్‌-రోర్‌ విశేష ఆహ్వానితులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలను కల్చరల్‌ డైరెక్టర్స్‌ హరిణి మేడ, సమత పెద్దమారు, సవిత మునగ సమన్వయించగా అనూష బెస్త, శైలజ సప్ప సహకరించారు. దీపాలంకరణను శిరీష & శ్రీనివాస్‌ పద్యాల గారు చేసారు.

చికాగో ఆంధ్ర ఫౌండేషన్‌ ద్వారా ఈ ఏడాదంతా నిర్వహించిన సేవా కార్యక్రమాలను, మును ముందు చేపడుతున్న ప్రాజెక్ట్‌ లను ఎగ్జెక్యుటివ్‌ డైరెక్టర్‌ రామకృష్ణ తాడేపల్లి వివరించారు. తమ విరాళాలతో సంస్థ అభ్యున్నతికి ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్ల సేవలను వివరిస్తూ జనరంజకమైన ప్రకటనలను కూర్చి రూపొందించిన చిత్రలహరి కార్యక్రమం వినూత్నంగా ఉండి ప్రేక్షకులచే నవ్వులపువ్వులు పూయిస్తూ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ట్రెజరర్‌ పావని కొత్తపల్లి సారధ్యంలో రామారావు కొత్తమాసు, లక్ష్మి అనుమలశెట్టి, కిరణ్మయి వంకాయలపాటి, శ్రీకృష్ణ మతుకుమల్లి, హేమంత్‌ తలపనేని, కిరణ్‌ ఆదిమూలం, శైలేష్‌ మద్ది, శ్రేయ అద్దంకి, ప్రసాద్‌ ముత్యాల, ప్రభాకర్‌ మల్లంపల్లి నిర్వహించారు. వెండర్‌ బూత్స్‌ ఏర్పాట్లను సెక్రెటరీ శ్వేత కొత్తపల్లి పర్యవేక్షించగా, స్టేజ్‌ అలంకరణలను, ఫోటో బూత్‌ ను హిమబిందు బాలినేని ఏర్పాటుచేసారు. విజయ్‌ కొరపాటి, సురేశ్‌ ఐనపూడి ఆధ్వర్యంలో ‘‘బౌల్‌ ఓ బిర్యాని’’ వారు రుచికరంగా తయారుచేసిన విందు భోజనాన్ని సంఘ వ్వస్థాపకులు, డైరెక్టర్లు, ఎంతోమంది వాలంటీర్లు కొసరికొసరి వడ్డించారు. శ్రీమతి విద్య సుసర్ల, డా శ్రీ విశ్వనాధం సుసర్ల వితరణతో సభ్యులందరికీ తీపి మిఠాయిలు నింపిన పెట్టెలను అందజేసారు. ఈ సంవత్సరం నిర్వహించిన అన్ని కార్యక్రమాలకు సహకారాన్నందించిన వారంందరికీ అధ్యక్షులు మాలతి దామరాజు తన కృతజ్ఞతలను తెలుపగా, సెక్రెటరీ శ్వేత కొత్తపల్లి వందన సమర్పణ చేసారు.

భోజనానంతరం ఏర్పాటు చేసిన సంగీత విభావరిని స్థానిక గాయకులు మణి తెల్లాప్రగడ, రవి తోకల, అర్చన, సౌజన్య ప్రారంభించగా భారత్‌ నుంచి వచ్చిన యువ సినీ నేపద్య గాయకులు రేణుకుమార్‌, వైష్ణవి తమ గాత్రం గానంతో పాపులర్‌ బాణీలతో అలరించి మెప్పించారు. ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణ ప్రఖ్యాత సినీ సంగీత స్వరకర్త శ్రీ అనూప్‌ రూబెన్స్‌ గారి మ్యూజికల్‌ నైట్‌. ఇందులో సినీ నేపద్య గాయకులు ధనంజయ్‌, సాహితి చాగంటి, తెలుగు రాపర్‌ రోల్‌ రైడా వినిపించిన బాణీలు, జనరంజక గీతాలను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనూప్‌ గారు చికాగో ఆంధ్ర సంఘం కోసం అప్పటికప్పుడు స్వరపరిచిన గీతం మరో విశేష ఆకర్షణగా నిలిచింది. స్వదేశ్‌ మీడియా నగేశ్‌ కండ్రేగుల ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలనందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధ్యక్షులు గౌరీశంకర్‌ అద్దంకి, సెక్రెటరీ శ్వేత కొత్తపల్లి, ట్రెజరర్‌ పావని కొత్తపల్లి, జాయింట్‌ సెక్రెటరీ హరిణి మేడ, జాయింట్‌ ట్రెజరర్‌ రామారావు కొత్తమాసు, డైరెక్టర్లు సమత పెద్దమారు, ఉష కొత్త, సవిత మునగ, సుందరవల్లి మల్లాది, రామకృష్ణ తాడేపల్లి, విజయ్‌ కొరపాటి, మురళి రెడ్డివారి, ప్రభాకర్‌ మల్లంపల్లి, శ్రీనివాస్‌ పద్యాల, లక్ష్మినాగ్‌ సూరిభొట్ల, పూజిత నెట్టెం, సిద్ధార్ధ్‌ అనుమలశెట్టి, మరియు ఎంతోమంది వాలంటీర్లు శ్రమించారు.

అమెరికా, భారత దేశాల జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం సుసంపన్నమయింది.

 

Click here for Event Gallery

 

Tags :
ii). Please add in the header part of the home page.