సీఏఏ ఆధ్వర్యంలో వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

చికాగో ఆంధ్ర అసోసియేషన్ (సీఏఏ) ఆధ్వర్ంయలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళల సాధికారత కోసం టెక్నాలజీ, ఇన్నోవేషన్ వినియోగం (డిజిట్ఆల్) అనే థీమ్‌తో ఈ వేడుకలను నిర్వహించారు. సీఏఏ ప్రెసిడెంట్ గౌరీశంకర్ అద్దంకి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. చైర్మన్ సుజాత అప్పలనేని, మాజీ ప్రెసిడెంట్ మాలతి దామరాజు, వైస్ ప్రెసిడెంట్ శ్వేత కొత్తపల్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్ సతీమణి అనిందిత ఘోష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ప్రముఖ కథక్ డ్యాన్సర్ మధుర సానే ఈ వేడుకల్లో పాల్గొని రీల్స్ పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా మరికొన్ని పోటీలు కూడా ఏర్పాటు చేశారు. బోర్డ్ డైరెక్టర్లు అనురాధ గంపాల, అనూష బెస్త, అన్విత పంచాగ్నుల, సౌజన్య రాళ్లబండి, హరిణి మేడ, లక్ష్మీనాగ్ సూరిభొట్ల, సవిత మునగ, సుచిత్ర తెల్లాప్రగడ, సుందరవెల్లి మల్లాది, గిరి కొత్తమాసు, హేమంత్ తలపనేని, మురళీ రెడ్డివారి, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, రామారావు కొత్తమాసు, శ్రీనివాసమూర్తి పద్యాల, సురేష్ ఐనపూడి, వాలంటీర్లు సమత పెద్దమారు, స్వాతి దావులూరు, శ్రీస్మిత నండూరి తదితరులంతా నెలరోజులకుపైగా కష్టపడి ఈ వేడుక కోసం ఏర్పాట్లు చేశారు.