MKOne TeluguTimes-Youtube-Channel

న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని సందర్శించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ

న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని సందర్శించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ

అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్ ‌లోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు ఎన్.వి.రమణ కు వేద మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయంలో దేవతా మూర్తులను ఎన్.వి.రమణ దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. సాయి దత్త పీఠం ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు  రఘుశర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, ఆలయ బోర్డ్ డైరెక్టర్లు, స్టాఫ్, వాలంటీర్లు ఎన్.వి.రమణను కలిసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Click here for Photogallery

Tags :