బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఘనంగా జరుపుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

 

Tags :