తైవాన్ లక్ష్యంగా ఇవి కొనసాగుతాయి... ఆపే ప్రసక్తే లేదు

తైవాన్ లక్ష్యంగా ఇవి కొనసాగుతాయి...  ఆపే ప్రసక్తే లేదు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై చైనా ఆగ్రహం ఇంకా చల్లారలేదు. పెలోసీ తైవాన్‌ సందర్శిస్తానని ప్రకటించిన సమయంలో నాలుగు రోజుల సైనిక విన్యాసాలను డ్రాగన్‌ ప్రకటించింది. దీంతో ఇవి ఆదివారంతో ముగుస్తాయని అందరూ భావించారు. కానీ ఈ విన్యాసాలు ఆగవని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఆర్సీ) స్పష్టం చేసింది. తైవాన్‌ లక్ష్యంగా ఇవి కొనసాగుతూనే ఉంటాయని పేర్కొంది. ఇంకెంత కాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత ఇచ్చేందుకు పీఆర్సీ నిరాకరించింది.

 

Tags :