ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి : చైనా

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి : చైనా

చైనాతో యుద్ధమంటూ వస్తే గెలుపు భారత్‌ వైపే ఉంటుందన్న భారత ఆర్మీ చీఫ్‌ నరవాణే వ్యాఖ్యలపై చైనా స్పందించింది. భారత్‌లో ఓ బాధ్యతలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకుంటే బాగుంటుందని పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ బెన్‌బిన్‌ మాట్లాడుతూ  ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి బాధ్యత గల వ్యక్తులు మాట్లాడటం బాగోలేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆశిస్తున్నట్లు బెన్‌బిన్‌ పేర్కొన్నారు.

 

Tags :