తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు

చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనను విజయవంతంగా ముగించడంపై డ్రాగన్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. పెలోసీ తైవాన్‌లో ఉండగానే ఆ ద్వీప దేశానికి సమీపంలో లైవ్ డ్రిల్ చేపట్టిన చైనా దీవి చుట్టూ భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాల నిర్వహణ మొదలుపెట్టింది. నాలుగు రోజుల పాటు ఈ డ్రిల్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విన్యాసాల కోసం తైవాన్ చుట్టూ ఆరు కీలక ప్రదేశాలను ఎంపిక చేసినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అయితే తైవాన్‌కు కేవలం 12 మైళ్ల దూరంలోనే ఈ డ్రిల్స్ జరగనున్నట్లు తెలిసింది. అయితే అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘించి తైవాన్ జలాలు, గగనతలంలోకి తమ నౌకలు, విమానాలను పంపించడం లేదని డ్రాగన్ చెబుతోంది.
Tags :