గ్లోబల్ టెర్రరిస్టు ముద్రకు చైనా మద్దతు

లష్కరే తాయిబా ఉగ్రవాది అబ్దుల్ రహమాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలంటూ భారత్, అమెరికా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీలో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డింది. ప్రతిపాదన యూఎన్ నిబంధనల ప్రకారం లేదని సాకులు చెప్పింది. మక్కీ పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సోదరుడు. మక్కీని ఇప్పటికే అమెరికా, భారత్ ఉగ్రవాదిగా గుర్తించాయి. గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలని ఈ నెల 1న యూఎన్‌లో సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఉగ్రవాదంపై చైనా ద్వంద్వ వైఖరికి తాజా పరిణామం నిదర్శనమని భారత్ విమర్శించింది.
Tags :