MKOne TeluguTimes-Youtube-Channel

ఇది మనకెంతో అవమానం : నిక్కీ హెలీ

ఇది మనకెంతో అవమానం : నిక్కీ హెలీ

అమెరికా ఇప్పటివరకు ఎదుర్కొన్న దేశాలతో పోలిస్తే అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువు అని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హెలీ అన్నారు. రిపబ్లికన్‌ పార్టీ కార్యక్రమంలో చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు  చేశారు. మన సరిహద్దులకు ఫెన్టాలిన్‌ ( తీవ్ర నొప్పి నివారణకు వాడే డ్రగ్‌)ను పంపుతోన్న ఆ దేశాన్ని ఎదుర్కోవాలి అని అన్నారు. అమెరికా గగనతంలో ఓ చైనా నిఘా బెలూన్‌ వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. ఇది మనకెంతో అవమానం అంటూ బెడైన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనా విషయంలో బైడెన్‌ వ్యవహరిస్తోన్న తీరును నేను నమ్మలేకపోతున్నా. మన దేశంలో చైనా సంస్థలు 3,80,00 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాయి. అందులో కొన్ని మన మిలిటరీ బేస్‌లకు దగ్గరగా ఉన్నాయి. ఒక శత్రుదేశం మనదగ్గర భూమిని కొనేందుకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించకూడదు అని అన్నారు. అమెరికా పని అయిపోయిందని చైనా భావిస్తోందని, ఆ విషయంలో డ్రాగన్‌ పొరబడుతుందని తెలిపారు. తన దేశాన్ని మరలా సగర్వంగా తీర్చిదిద్దేందుకే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు తెలిపారు. 

 

 

 

Tags :