చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌

చైనాలో మళ్లీ  లాక్‌డౌన్‌

త్వరలో సెలవులు వస్తుండటంతో స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున ఉండే నౌకా నగరమైన టియాంజిన్‌లో 14 కొత్త కేసులు రావడంతో ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. చైనాలో కొత్తగా 1,552 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. ఈ సంఖ్య తక్కువే అయినా, ప్రభుత్వం తన జీరో కొవిడ్‌ విధానంలో భాగంగా లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు విధిస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు చైనాలో కొత్త సంవత్సరం తర్వాత వచ్చే సెలవుల కారణంగా ప్రయాణాలు ఎక్కువుతాయని భావించి, వాటిని నియంత్రిచేందుకు లాక్‌డౌన్‌ విధించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఆంక్షలు విధించినట్లు తెలిసింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.