చైనాలో వారంలోనే 13 వేల మందికి పైగా

చైనాలో వారంలోనే 13 వేల మందికి పైగా

చైనాలో కొవిడ్‌ 19 స్వైరవిహారం చేస్తోంది. ఈ నెల 13 నుంచి 19 మధ్య వివిధ ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌తో 13వేలకు పైగా మృతి చెందారని ఆ దేశ ఉన్నత వైద్యాధికారి ఒకరు పేర్కొన్నారు.  తాజా ఉధృతితో 80 శాతం పైగా జనాభాకు వైరస్‌ సోకిందని తెలిపారు. ఒక్క నెలలోనే 60 వేల మంది కొవిడ్‌తో మృతి చెందారని ఇటీవల చైనా పేర్కొన్న వారానికే ఈ తాజా మరణాల సంఖ్య కలవరపరుస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన 681 మంది మృతి చెందారని  సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది. ఇందులో ఇంటి దగ్గర మృతి చెందిన రోగుల వివరాలను పొందుపరచలేదు.

 

 

Tags :