చైనా సరికొత్త రికార్డు..

చైనా సరికొత్త రికార్డు..

చైనా కృత్రిమ సూర్యుడు ఎక్స్‌పెరిమెంటల్‌ అడ్వాన్స్‌డ్‌ సూపర్‌ కండక్టింగ్‌ టొకమాక్‌ (ఈస్ట్‌) ఫ్యూజన్‌ ఎనర్జీ రియాక్టర్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. సూర్యుడిలో శక్తి ఉత్పత్తి ప్రక్రియను అనుకరించే ఈ రియాక్టర్‌, తాజాగా 1056 సెండ్ల పాటు ఏడు కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించింది. అంటే 17 నిమిషాలకు పైమాటే. సూర్యుడి వేడి 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్‌తో పోల్చితే ఇది దాదాపు అయిదు రెట్టు ఎక్కువని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ప్లాస్మా ఫిజిక్స్‌ పరిశోధకుడు గాంగ్‌ జియాన్డు తెలిపారు. నిరంతర అధిక ఉష్ణోగ్రత ప్లాస్మా ఆపరేషన్‌లో ప్రపంచంలోనే ఇది అత్యంత సుదీర్ఘమైందని వెల్లడిరచారు. డ్యుటేరియం వినియోగంతో సూర్యుడిలో జరిగే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ ప్రక్రియను అనుకరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్నం చేడయమే ఈస్ట్‌ ఉద్దేశం. ఈ పరికరం చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఉంది.

 

Tags :