జియాంగ్ జెమిన్ ఇకలేరు

డ్రాగన్ దేశంలో చైనా అధ్యక్షుడిగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, నేడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న అభివృద్ధికి బాటులు వేసిన నాయకుడిగా కీర్తి గడించిన జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. 96 ఏళ్ల జెమిన్ కొంత కాలంగా లుకేమియా, అవయవాల వైఫల్యంతో బాధపడుతున్నారు. గతంలో మేయర్గా సేవలందించిన షాంఘై నగరంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. జెమిన్ మృతి దేశ ప్రజలకు తీరని లోటు అని చైనా కమ్యూనిస్ట్ పార్టీ, పార్లమెంట్, సైన్యం పేర్కొన్నాయి. ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించడానికి జెమిన్ దూరదృష్టి, ఆలోచనలు, నిర్ణయాలే కారణం అంటే అతిశయోక్తి కాదు.
Tags :