తైవాన్ లో అడుగు పెడితే మా సైన్యం చూస్తూ ఊరుకోదు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అతలాకతలవుతున్న తరుణంలో చైనా, అమెరికా మధ్య తైవాన్ వివాదం తార స్థాయికి చేరింది. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం జోక్యం తగదని చైనా ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తోంది. తాజాగా, తైవాన్లో అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించనున్నారనే వార్తల నేపథ్యంలో తీవ్రంగా స్పందించింది. తైవాన్లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే తమ మిలిటరీ చూస్తూ ఊరుకోదని చైనా హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ సాధారణ సమావేశం సందర్భంగా డ్రాగన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్లో అమెరికా ప్రభుత్వం తరపున పర్యటిస్తున్న పెలోసీని మూడవ వ్యక్తిగా చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు. తైవాన్ తమ అంతర్గతమని స్పష్టం చేశారు.
Tags :