అమెరికాను హెచ్చరించిన చైనా

అమెరికాను హెచ్చరించిన చైనా

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి 2020లో తలెత్తిన ఉద్రిక్తతలు అమెరికాకు భారత్‌ను మరింత చేరువ చేస్తాయని చైనా భయపడిందా? అందుకే సరిహద్దు ఉద్రిక్తతల్లో జోక్యం చేసుకోవద్దని అగ్రరాజ్యాన్ని ఆనాడు డ్రాగన్‌ హెచ్చరించిందా? అవుననే అంటోంది అమెరికా రక్షణ శాఖ. చైనా సైనిక మోహరింపులపై పెంటగాన్‌ తన తాజా నివేదికను కాంగ్రెస్‌కు సమర్పించింది. అందులో భారత్‌-చైనా సరిహద్దు అనే భాగంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. 2020 మే నెల అనంతరం భారత్‌ చైనాల మధ్య ఎల్‌ఏసీ పొడుగునా పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గల్వాన్‌ ఘర్షనా చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో రెండు దేశాలు తమ సైన్యాలను భారీగా మోహరించాయి.  ఆ సమయంలో వాషింగ్టన్‌కు భారత్‌ మరింత దగ్గరవుతుందన్న ఆందోళన చైనాలో వ్యక్తమైందని నివేదిక తెలిపింది. అందుకే భారత్‌తో  తమ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని తమ అధికారులను చైనా హెచ్చరించినట్లు  నివేదికలో పేర్కొంది.

 

Tags :