అవసరమైతే బలప్రయోగం తప్పదు : చైనా

అవసరమైతే బలప్రయోగం తప్పదు : చైనా

తైవాన్‌లో ఏర్పాటు వాదాన్ని అసలు సహించమని చైనా పునరుద్ఘాటించింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. నాన్సీ పెలోసీ పర్యటన తరువాత తైవాన్‌ చుట్టుపక్కల భారీ ఎత్తున చైనా యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన తరువాత ఈ ప్రకటన వెలువడింది. చైనాకు చెందిన తైవాన్‌ ఆఫైర్స్‌ ఆఫీస్‌ ఈ మేరకు శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఆర్థిక తాయిలాలు సైనిక బలం సాయంతో తైవాన్‌ను ఏ విధంగా వశం చేసుకుంటామో దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రశాంతంగా విలీనం కావడానికి అవసరమైన  అవకాశాలను కల్పిస్తాం. అదే సమయంలో ఏ విధమైన వేర్పాటు వాదానికి చోటు లేదు. బలప్రయోగ అవకాశాలను తోసిపుచ్చడం లేదు. విలీనానికి అవసరమైన  ఏ చర్య తీసుకోడానికైనా ఆప్షన్‌ను సిద్ధంగా పెట్టుకొన్నాం. వేర్పాటు వాదులు, బాహ్య శక్తులు, లక్ష్మణ రేఖను దాటడమే మేము కఠిన చర్యలు తీసుకొనేలా పురిగిల్పుతాయి అని  పేర్కొన్నారు.

 

Tags :