ఇచ్చిన హామీకి అమెరికా కట్టుబడి ఉండాలి : చైనా

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటిస్తే చైనా సైన్యం చూస్తూ ఊరుకోదని ఆ దేశ రక్షణ ప్రతినిధి వ్యాక్యానించారు. తైవాన్‌లో పెలోసి పర్యటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్న తరుణంలో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఈ హెచ్చరిక చేసింది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతివ్వబోమని ఇచ్చిన హామీకి కట్టుబడి వుండాల్సిందిగా చైనా రక్షణ శాఖ ప్రతినిధి టాన్ కెఫ్ అమెరికాకు కోరారు. ఒకవేళ పెలోసి పర్యనటకు ఉపక్రమించిన పక్షంలో దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags :