నాలుగు సంవత్సరాల తర్వాత... రష్యాను సందర్శించనున్న జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చేవారం రష్యా ను సందర్శిస్తారని బీజింగ్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మాస్కోకు జిన్‌పింగ్ మొదటి పర్యటన. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వనం మేరకు అధ్యక్షుడు జిన్‌పింగ్ మార్చి 20 నుంచి 22 వరకు రష్యాలో పర్యటించనున్నారు అని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది బీజింగ్‌లో జరిగిన విటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి పుతిన్ హాజరైనప్పటికీ, సెప్టెంబరులో ఎబ్జెకిస్తాన్‌లో జరిగిన ప్రాంతీయ భద్రతా సమావేశంలో ఇరువురు నేతలు సమావేశమైనప్పటికీ చివరిసారిగా 2019లో రష్యాను సందర్శించారు. రష్యా`చైనాలు వూహాత్మక మిత్ర దేశాలు. ఈ పర్యటనలో పుతిన్, జిన్‌పింగ్‌లు వ్యూహాత్మక సహకారం గురించి మాట్లాడనున్నారని అంతర్జాతీయ వేదికతో సహా రష్యా చైనాల మధ్య సమగ్ర భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందిచడంపై ఇరువురు నేతలు చర్చిస్తారని క్రెమ్లిన్ తెలిపింది.