మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా

మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌, చైనాల మధ్య ఉద్రికత్తలు క్రమంగా చల్లబడుతున్నాయి. పరస్పర అంగీకారం మేరకు అక్కడ బలగాల ఉపసంహరణ జరిగినట్లు తాజా ఆధారాలు సూచిస్తున్నాయి. గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతంలో కీలకమైన పెట్రోలింగ్‌ పాయింట్‌ (పీపీ)-15 నుంచి డ్రాగన్‌ సైన్యం 3కిలోమీటర్ల మేర వెనక్కి మళ్లినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 ఆగస్టు 12న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారీ సైనిక స్థావరాన్ని చైనా ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తూర్పున సైనిక పోరాటాలకు అనువుగా కొన్ని నిర్మాణాలు కనిపించాయి. పదాతిదళ మోహరింపుల కోసం గోతులు తవ్వి, బంకర్ల తరహ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టమవుతోంది. పశ్చిమం వైపు  కూడా ఓ చిన్న శిబిరం ఉంది. బలగా ఉపసంహరణ అనంతరం ఈ నెల 15న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ సైనిక స్థావరాన్ని చైనా కూల్చివేసినట్లు స్పష్టమైంది. దాని శకలాలను మూడు కిలోమీటర్ల దూరంలో తాత్కాలికంగా సిద్ధం చేసుకున్న సైనిక శిబిరానికి తరలించినట్లు స్పష్టమవుతోంది.

 

Tags :