చైనా కుబేరుడు గువో అమెరికాలో అరెస్ట్

చైనా ప్రభుత్వం చాలాకాలం నుంచి వేటాడుతున్న వ్యాపారి గువో వెంగుయి (54) అమెరికాలోనూ 100 కోట్ల డాలర్ల ఆన్‌లైన్ మోసానికి పాల్పడ్డారంటూ న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయనకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గువో ఇతరుల నుంచి సేకరించిన డబ్బుతో 50,000 చదరపుటడుగుల భవంతిని, 35 లక్షల డాలర్ల విలువైన ఫెరీరా కారును, 36 వేల డాలర్ల విలువైన రెండు పరువులను కొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
Tags :