భారత్ కు మద్దతు ఇస్తాం.. జిన్‌పింగ్

వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) అధ్యక్ష పదవిలో భారతదేశాన్ని నియమించడానికి మద్దతు ఇస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ఎన్‌సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన అనంతరం జిన్‌పింగ్ తన మద్దతు ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్‌సీఓకు అధ్యక్షత వహిస్తున్నందుకు భారత్‌కు అభినందనలు. వచ్చే ఏడాది ఎన్‌సీఓ ప్రెసిడెన్సీ కోసం భారత్‌కు మేం మద్దతు ఇస్తాం అని జిన్‌పింగ్ తెలిపారు. అంతర్జాతీయ వ్యవస్థ మరింత న్యాయంగా, హేతుబద్ధంగా అభివృద్ధి చెందే విధంగా ప్రపంచ నేతలు కలసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. నిష్ప్రయోజనకరమైన పనులను, కూటమి రాజకీయాలను వదిలిపెట్టాలని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి ఆసరాగా తీసుకుని అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేయాలని జిన్‌పింగ్ సూచించారు.
Tags :