చైనా శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ

మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైరెలెస్ మాస్కును చైనా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఆప్టేమర్స్ అనే సింథటిక్ అణువులతో తయారుచేసిన ప్రత్యేక బయో సెన్సర్‌ను మాస్కులో వారు పొందుపర్చారు. వాతావరణంలో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లను అది కేవలం 10 నిమిషాల్లో నిర్ధారిస్తుంది. ఆ మాస్కు ధరించిన వ్యక్తి ఫోన్‌కు సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది.
Tags :