అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : చింతామోహన్

అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : చింతామోహన్

ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవసరమని, అది కాంగ్రెస్‍ పార్టీతోనే సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‍ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు.  దీపావళిలోపు రాష్ట్ర కాంగ్రెస్‍ పార్టీకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రతినిధిగా నియమితులవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లు విక్రయించడం అవసరమా అని ప్రశ్నించారు. పేదలకిచ్చే బియ్యాన్ని ప్రజాప్రతినిధులు 50 శాతం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ పోతుందన్న దిగులుతో జగన్‍ బయటకు రావడం లేదని అన్నారు. బోగి పండుగలోపు రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి రాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.

 

Tags :