అతని డైరెక్షన్ లో నటించాలనే కోరిక నాకు లేదు : మెగాస్టార్ చిరంజీవి

అతని డైరెక్షన్ లో నటించాలనే కోరిక నాకు లేదు : మెగాస్టార్ చిరంజీవి

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ గాడ్ ఫాదర్. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌తో అంచనాలను రెట్టింపు చేసింది. మెగాస్టార్ చిరంజీవి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టడంతో బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇటు తెలుగు.. అటు హిందీలో కూడా  జోరుగా సాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  తెలుగుతో పాటు హిందీలోనూ గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో బాలీవుడ్‌లోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుధీరుడు రాజమౌళి గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అని.. ఆయన అంటే తనకు ఇష్టమని చెప్పారు. అయినా ఆయన డైరెక్షన్‌లో యాక్ట్ చేయాలనే కోరిక లేదన్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా డిప్‌గా చూస్తారని.. ఆయన కోరుకున్న ఔట్‌పుట్‌ను ఇవ్వగలనో లేదో తనకు తెలియదన్నారు. ఆయన ఒక సినిమాతో మూడు నుంచి ఐదేళ్లు ప్రయాణిస్తారని.. అదే వ్యవధి లో తాను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. అందుకే రాజమౌళితో వర్క్ చేయాలని గానీ.. పాన్ ఇండియా యాక్టర్‌గా గుర్తింపు పొందాలని గానీ లేదంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే తాను ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని మాత్రం చెప్పారు. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' కు గాడ్ ఫాదర్ రీమేక్‌. మోహ‌న్ రాజా  దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ , నయనతార, సత్యదేవ్ , సునీల్ , యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

 

Tags :
ii). Please add in the header part of the home page.