రాజకీయాలపై చిరంజీవి క్లారిటీ

రాజకీయాలపై చిరంజీవి క్లారిటీ

రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనని, వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని చిరంజీవి వెల్లడించారు. అటువంటి వాటికి తాను దూరమని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది.

 

Tags :