అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్‌చరణ్

భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను తెలుగు సినిమా పరిశ్రమ గణనీయంగా ప్రభావితం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ నటుటు చిరంజీవి, రామ్‌చరణ్ కేంద్ర హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ను అమిత్ షా శాలువాతో సత్కరించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం అద్భుత విజయం సాధించడంపై రామ్‌చరణ్‌ను కేంద్ర మంత్రి అభినందించారు. ఇద్దరు దిగ్గజాలను (చిరంజీవి, రామ్ చరణ్) కలవడం ఆనందంగా ఉందని అమిత్ షా అన్నారు. రామ్ చరణ్‌కు అభినందనలు తెలిపి ఆశీస్సులు అందజేసినందుకు కేంద్ర హోంమంత్రికి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బృందం, రామ్‌చరణ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి.
Tags :