శ్యామ్ సింగరాయ్ సక్సెస్‌ను అభినందించిన మెగాస్టార్

శ్యామ్ సింగరాయ్ సక్సెస్‌ను అభినందించిన మెగాస్టార్

నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చిందనుకుంటా! సినిమా చూసిన తరువాత  ఆయ‌న్ని వెళ్లి నాని క‌లిశారు. ఇద్ద‌రూ ఉన్న ఫొటోను నాని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌డం విశేషం.  మెగాస్టార్ చిరంజీవిని హీరో నాని క‌లిశారు. రీసెంట్‌గా క‌లిశారో లేక‌.. అప్పుడెప్పుడైనా క‌లిశారో తెలియ‌డం లేదు కానీ. నాని త‌న ట్విట్ట‌ర్‌లో మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన ఫొటోను షేర్ చేశారు. ఓ వైపు చిరంజీవి.. మ‌రో వైపు నాని మీసాలు తిప్పుతూ క‌నిపిస్తుండ‌టమే ఈ ఫొటోలో విశేషం. ఇక నాని మీసం తిప్పుతున్నారంటే కార‌ణం.. ఆయ‌న శ్యామ్ సింగ‌రాయ్ సినిమా కోస‌మేన‌ని అనుకోవాలి. గ‌త ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌లైన శ్యామ్ సింగరాయ్ మంచి వసూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌క్సెస్‌ను నాని ఇప్పుడు చిరంజీవితో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు.

సినిమా స‌క్సెస్ గురించి చిరంజీవి నాని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఫొటోను షేర్ చేసిన నాని, దాంతో పాటు ల‌వ్ సింబ‌ల్‌ను కూడా పోస్ట్ చేశారు. ఇదే ఫొటోను ఉన్న ట్వీట్‌ను చిత్ర దర్శ‌కుడు రాహుల్ సంకృత్యాన్ షేర్ చేస్తూ మై హీరోస్ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం శ్యామ్ సింగ‌రాయ్‌. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవ దాసి వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేసే యువ‌కుడు శ్యామ్ సింగ‌రాయ్ క‌థే ఈ సినిమా. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌డోన్నా సెబాస్టియ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇదంతా బాగానే ఉన్నా.. నెటిజ‌న్స్, నాని ఫ్యాన్స్ నాని పోస్ట్ చేసిన ఫొటోను చూసి తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట‌. ఇంత‌కీ వారు అంతగా బాధ‌ప‌డ‌టానికి కార‌ణం.. ఆ ఫొటోలో నానికి తెల్ల వెంట్రుక‌లున్న‌ట్లు క‌నిపించ‌డ‌మే. అదేంట‌న్నా నువ్వు ముస‌లోడివి అయిపోతున్నావంటూ వారు తమ బాధ‌ను ఫొటో కింద కామెంట్స్ రూపంలో వ్య‌క్తం చేస్తున్నారు.

శ్యామ్ సింగ‌రాయ్ సినిమా రిలీజ్ స‌మ‌యంలో నాని..ఏపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌నంగా మారాయి. ఏపీలోని టికెట్ రేట్స్‌ను ఉద్దేశించి థియేట‌ర్ కంటే ప‌క్క‌నున్న కిరాణా షాప్‌లో ఎక్కువ‌గా డ‌బ్బులుంటున్నాయి అన‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు నానిని టార్గెట్ చేశారు. అయితే అవాంత‌రాల‌ను దాటి సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. నాని ఈ సినిమా కోసం త‌న రెమ్యున‌రేష‌న్‌లో కొంత భాగాన్ని నిర్మాత‌ల‌కు ఇచ్చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

 

Tags :