ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ

ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఎస్సీ`1998 అభ్యర్థుల ఎంపిక జాబితాలో ఉంది. తాను అన్నామలై విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేశానని, ఇప్పుడు ఎంపికైన విషయాన్ని తన మిత్రులు చెపప్పారని ఆయన తెలిపారు. ఈ వార్త వినగానే చాలా ఆనందం కలిగింది. సీఎం జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని మా వాళ్లంతా సంతోషంగా చెప్పారు. పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ఇప్పుడు ఉద్యోగంలో చేరితే పదేళ్లపాటు సర్వీసులో ఉంటాను. ఆ బ్యాచ్‌లో చాలామంది జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయి. వాళ్లంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉన్న ఆనందం మరే ఉద్యోగంలోనూ ఉండదని, ప్రజా ప్రతినిధిగా కంటే ఉపాధ్యాయ మృతి అంటేనే తనకు ఇష్టమని ధర్మశ్రీ తెలిపారు.

 

Tags :