సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా .. భారతీయ అమెరికన్

సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా .. భారతీయ అమెరికన్

అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. ఆ దేశ గూఢచార్య సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) తొలి ఛీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)గా నంద్‌మూల్‌ చందానీ నియమితులయ్యారు. సాంకేతిక రంగంలో ఆయనకు పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మూల్‌చందానీ ఇంతకుముందు అమెరికా రక్షణ శాఖ జాయింట్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌కు సీటీవోగా, తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేశారు. ఆబ్లిక్స్‌ డిటెర్నినా తదితర విజయవంతమైన అంకుర సంస్థల స్థాపనలో పాలుపంచుకున్నారు. ఢిల్లీ లోని ఓ పాఠశాలలో ఆయన చదువుకున్నారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

 

Tags :