MKOne Telugu Times Youtube Channel

నాట్స్‌ సంబరాల్లో సినీ రచయితల ముచ్చట్లు

నాట్స్‌ సంబరాల్లో సినీ రచయితల ముచ్చట్లు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి.

ఈ సంబరాల్లో భాగంగా తెలుగు సినీ రచయితలతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సినీ రచయితగా నా ప్రస్థానం, మాటా మంతి పేరుతో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్‌, సిరాశ్రీ, బలభద్రపాత్రుని రమణి పాల్గొంటున్నారని నిర్వాహకులు చెప్పారు. 

 

 

Tags :