రాష్ట్రపతి ముర్ముతో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

రాష్ట్రపతి ముర్ముతో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

రాష్ట్రపతిగా ఇటీవలే పదవీ ప్రమాణం చేసిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖులు కలిశారు. రాష్ట్రపతిగా ఎన్నిక అయినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ సతీ సమేతంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తన సతీమణితో కలసి ఆయన అభినందించారు. ఈ ఫోటోలను రాష్ట్రపతి భవన్‌ వర్గాలు సోషల్‌ మీడియాతో విడుదల చేశాయి. ఇది ఇలా ఉండగా, పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు కూడా ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపారు.

 

Tags :