కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 17న సుమారు అరగంటపాటు భేటీ అయిన ఆయన రెండు వారాల్లోనే రెండోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. అమిత్ షా ఇంటికి రావడంలో జాప్యం కావడంతో దాదాపు గంటలకు పైగా ఆలస్యంగా మొదలైంది. రాత్రి 10:45కి లోపలకు వెళ్లిన సీఎం 11:25కి బయటకు వచ్చారు. ముందస్తు ఎన్నికలు, వివేకా హత్యకేసులో దర్యాప్తు బృందం మార్పు లాంటి అంశాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. గత పర్యటనలో ప్రధాని, హోంమంత్రి అమిత్‌షాలను కలిసిన సీఎం తర్వాత 10 అంశాలతో ప్రకటన విడుదల చేసింది. వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు అందులో పేర్కొంది. ఇప్పటి వరకు వాటిపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గతంలో విడుదల చేసిన ప్రకటనలోని అంశాలతోనే మరో ప్రకటనను సీఎం కార్యాలయం విడుదల చేసింది.