శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్

శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్

విజయవాడలోని శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సందర్శించారు. పటమట దత్తానగర్‌లోని ఆశ్రమానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా జగన్‌ ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అవధూత, దత్త పీఠాధిపతి స్వామి సచ్చిదానందతో సమావేశమయ్యారు. అనంతరం వైఎస్‌ జగన్‌ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి వచ్చిన వైఎస్‌ జగన్‌ మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, పేర్ని నాని, మేయర్‌ బాగ్యలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు.

వైఎస్‌ జగన్‌తో సమావేశం అనంతరం గణపతి సచ్చిదానందస్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అర్చకులు సంతోషంగా ఉన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాను. వంశపారంపర్య అర్చకులను కొనసాగించాలని అడిగా. అందుకు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిచారని తెలిపారు.

 

Tags :