MKOne Telugu Times Youtube Channel

వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ సారథులు వాలంటీర్లేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 25 రకాల ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా కేవలం సేవ చేయాలనే తపనతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

 

 

Tags :