MKOne Telugu Times Youtube Channel

దావోస్ చేరుకున్న సీఎం జగన్

దావోస్ చేరుకున్న సీఎం జగన్

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ రాత్రి పొద్దుపోయాక దావోస్‌ చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అక్కడ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి విస్తృతంగా చర్చిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్‌ దావోస్‌ వెళ్లారు. 

 

Tags :