ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్‍ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‍ వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన వసంత్‍ విహార్‍లో తెలంగాణ భవన్‍కు ముఖ్యమంత్రి కేసీఆర్‍ భూమి పూజ చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‍ షా, నితిన్‍ గడ్కరీ, గజేంద్ర సింగ్‍ షెకావత్‍ను ముఖ్యమంత్రి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రతిపాదనలకు మోదీతో పాటు కేంద్ర మంత్రులు సానూకూలంగా స్పందించారు.

ఢిల్లీ నుంచే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‍ సమీక్షించి, సీఎస్‍కు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. అదేవిధంగా యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్‍ ఆహ్వానించారు.  వారం రోజుల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఢిల్లీ నుంచి హైదరాబాద్‍కు చేరుకున్నారు.

 

Tags :