స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో త్రివర్ణ పతకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం నివాళులర్పించారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 22న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

 

Tags :