ఆకుపచ్చని వీలునామా పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

ఆకుపచ్చని వీలునామా పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాలతో రూపొందించిన ఆకుపచ్చని వీలునామా అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొలి కాపీని పద్మశ్రీ తిమ్మక్కకు ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ మొక్క నాటడమనేది ఒక కార్యక్రమం కాదని, అది మనల్ని మన భవిష్యత్తు తరాలను బతికించే మార్గమని అన్నారు. ఆ బాధ్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. మంచి పనిలో నిమగ్నమైతే, గొప్పగా జీవించొచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనటానికి పద్మశ్రీ తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని,  అందరూ ఆ బాటలో నడవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

 

Tags :