మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

మెగాస్టార్‌ చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌ల్లో పరామర్శించారు. చిరంజీవికి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ ఆకాంక్షించారు. కాగా రెండు రోజుల క్రితం చిరంజీవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్భందంలో ఉన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్పంగా లక్షణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోండి. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

 

Tags :