చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. ముచ్చింతల్‌ ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో చినజీయర్‌ స్వామి సత్కరించి, వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జీవ ప్రాంగణంలోని కుటీరంలో చినజీయర్‌ స్వామితో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. భగవత్‌ రామానుజచార్య ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా కుటీర ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు.

 

Tags :