ఈ నెల 20న మునుగోడు సభలో అభ్యర్థిని ప్రకటిస్తా : కేసీఆర్

ఈ నెల 20న మునుగోడు సభలో అభ్యర్థిని ప్రకటిస్తా :  కేసీఆర్

మునుగోడు సభలో అభ్యర్థిని తానే ప్రకటిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో కంచర్ల కృష్ణారెడ్డితో సీఎం కేసీఆర్‌ సమావేశయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కంచర్ల కృష్ణారెడ్డికి కొన్ని సూచనలు చేశారు. ఈ నెల 20వ తేదీన టీఆర్‌ఎస్‌ జరప తలపెట్టిన మునుగోడు సభ ను విజయవంతం చేయూలని సూచించారు. అదే సమయంలో ఉప ఎన్నికకు కూడా విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కలిసికట్టుగా మునుగోడు సభను ఉప ఎన్నికను విజయవంతం చేయాలన్నారు. ఎవరితోనూ భేదాభిప్రాయాలు వద్దు. మునుగోడు సభలోపు నల్గొండ జిల్లా మునుగోడు  నేతలందరితో స్వయంగా నేనే మాట్లాడుతా అని అన్నారు.

 

Tags :