తెలంగాణలో మరో కొత్త పథకానికి... సీఎం కేసీఆర్ శ్రీకారం

తెలంగాణలో మరో కొత్త పథకానికి... సీఎం కేసీఆర్ శ్రీకారం

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సంపద పెంచడం పేదలకు పంచడం ఇదే తమ సిద్ధాంతమని, పోడు రైతులకు భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ మళ్లీ కల్లోలాలకు గురి కావద్దన్నారు. తెలంగాణ కోసం తన చివరిరక్తం బొట్టు వరకు పోరాడతానని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలు, తండాల్లో మిషన్‌ భగీరథ నీరు అందుతోందన్నారు.  గిరిజన విద్యాసంస్థలు పెంచుతున్నామని ప్రకటించారు.  నదీ జాలాలు సముద్రం పాలు కావొద్దని, స్వచ్ఛమైన పంటలు పండాలని ఆకాంక్షించారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలని కేసీఆర్‌ కోరారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఆదివాసీ, బంజారాభవన్‌లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని ఆకాంక్షించారు.

 

Tags :