మెట్రో ఫేజ్-2 కు సీఎం కేసీఆర్ భూమిపూజ

మెట్రో ఫేజ్-2 కు సీఎం కేసీఆర్ భూమిపూజ

ఈ నెల 9వ తేదీన  మెట్రో ఫేజ్‌-2  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నరు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2పై ప్రీబిడ్‌ హెచ్‌ ఏ ఎం ఎల్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ భేటీకి పలు ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సంస్థలు హాజరయ్యారు.  ఇందులో భాగంగా రాయదుర్గం నుంచి ఎయిర్‌ పోర్టు వరకు మెట్రో నిర్మాణంపై చర్చ జరిగింది.. మైట్రో రైల్‌ ఫేజ్‌-2 పై ప్రభుత్వ విధివిధానాలను హెచ్‌ ఏం ఎం ఎల్‌ తెలపనుంది. అదే విధంగా ప్రాజెక్టు నాణ్యత, టైం బాండ్‌ పై నిర్దేశం చేయనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 13 వ తేదీ వరకు బిడ్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 20న అర్హత కలిగిన కన్సలెన్సీ సంస్థల జాబితా ప్రకటించనున్నారు.

 

 

Tags :