రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 19న యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 11:30 గంటలకు యాదాద్రి బయల్దేరనున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి పున ప్రారంభ తేదీలను సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు. యాదాద్రి పున ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌ స్వామి నిర్ణయించి వున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలోనే ఆలయ పున ప్రారంభం తేదీలను సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటిస్తారు. పున ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు.

 

Tags :