ఈ నెల 10న మమత బెనర్జీ నామినేషన్

ఈ నెల 10న మమత బెనర్జీ నామినేషన్

భవానీపూర్‍ ఉప ఎన్నికల కోసం తృణమూల్‍ కాంగ్రెస్‍ అభ్యర్థిగా తాను ఈ నెల 10న నామినేషన్‍ దాఖలు చేస్తానని పశ్చిమబెంగాల్‍ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. పశ్చిమబెంగాల్‍ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయో కేవలం ఆ భగవంతుడికి మాత్రమే తెలుసని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సందర్భంగా చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావని అన్నారు. అప్పుడు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని, ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా వాళ్లు గెలిచే అవకాశం లేదని మమతా ధీమా వ్యక్తం చేశారు. నందిగ్రామ్‍లో తనపై జరిగిన దాడిలో బీజేపీ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. బయటి నుంచి వచ్చిన దాదాపు 1000 మంది బీజేపీ గుండాలు బెంగాల్‍ గురించి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజకీయంగా పోరాడే సత్తా లేకనే వాళ్లు విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

 

Tags :