తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వేదపండితులు సూచించిన ప్రకారం ఫిబ్రవరి 17 ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముందు వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తరపున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, డా.బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ తదితరులు హాజరవుతారని మంత్రి తెలిపారు.
Tags :