రాయలసీమ రైతులకు సీఎం వైఎస్ జగన్ ఆఫర్... ఏడాదికి

రాయలసీమ రైతులకు సీఎం వైఎస్ జగన్ ఆఫర్... ఏడాదికి

రాయలసీమ రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ ఆఫర్‌ ప్రకటించారు. రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు లీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్స్‌ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ప్రభుత్వమే రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని సౌర, పవన విద్యుత్‌ తయారీ సంస్థలకు ఇస్తుందని తెలిపారు.  ప్రభుత్వం మూడేళ్లకోసారి ఐదు శాతం లీజు పెంచుతుందని తెలిపారు. ఒక లొకేషన్‌లో  కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూములు సేకరించాలని, ఈ విషయంలో రైతులను ఒప్పించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించి రైతులు భూములు ఇచ్చేలా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. గ్రీన్‌కో ప్రాజెక్టులకు రైతులు సహకరించాలని  విజ్ఞప్తి చేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.