ఏపీ సేవ 2.0 ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ఏపీ సేవ 2.0 ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ఏపీ సేవ 2.0 పోర్టల్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో మరింత వేగం, పారదర్శకత, జవాబుదారీతనం కోసం సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు పలకడానికి అనువుగా ఉండేందుకు పోర్టల్‌కు ఏపీ సేవ అని పేరు పెట్టినట్లు తెలిపారు. గ్రామస్వరాజ్యంలో ఏపీ సేవ పోర్టల్‌ ఓ గొప్ప ముందడుగని అన్నారు. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ పారదర్శకత, జవాబుదారీతనం  పెరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ పోర్టల్‌ ద్వారా రెవెన్యూ, భూపరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను అదనంగా తీసుకొచ్చామన్నారు. మున్సిపాలిటీలకు చెందిన 25, పౌరసరఫరాలకు చెందిన 6, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌ రంగానికి చెందిన 53కు పైగా సేవలు ఈ పోర్టల్‌ కిందికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీ సేవ పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ వేగంగా ప్రభుత్వ పథకాలు అమలవుతాయని తెలిపారు.

 

Tags :