ఫైవ్ స్టార్ హోటల్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ఫైవ్ స్టార్ హోటల్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

గుంటూరు జిల్లాలోని విద్యానగర్‌లోని ఐటీసీ హోటల్స్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. అందులో ఒకటిగా గుంటూరులో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఐటీసీ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో ముందుకు వెళ్తామని తెలిపారు.

 

Tags :